రైలు ప్రయాణం - Train Journey

రైలు ప్రయాణం ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రయాణంలో మనం కిటికీల ద్వారా అన్నీ చూడవచ్చు. ప్రయాణంలో మనం కదులుతున్న రైలులో నడవవచ్చు, మంచి ఆహారం మరియు చిరుతిండ్లు తినవచ్చు, ఆటలు ఆడవచ్చు మరియు సరదగా ముచ్చటించవచ్చు. మొత్తంమీద, ఇది ఒక అందమైన అనుభవం.


నేను సియాటెల్ నుండి పోర్ట్ ల్యాండ్ వరకు ప్రయాణించాను. మేము సమయానికి రైలు నిలయానికి చేరుకున్నాము. వరుసలో నిలబడి మా టిక్కెట్లను తనిఖీ చేయించుకున్నాము. సిబ్బంది మా కోచ్ మరియు సీట్లను ధృవీకరించారు, మా సామాను సేకరించారు మరియు వాటిని తనిఖీ చేసారు. టిక్కెట్ పరిశీలకుడి దుస్తులు నన్ను ఆకట్టుకున్నాయి. రైలు ప్రయణానికి సంబంధించిన అన్ని ప్రక్రియలూ పూర్తి చేసి రైలు ఎక్కాం.


రైలు నిలయాలు ఎప్పుడూ తమదైన ప్రత్యేక సువాసనను కలిగి ఉంటాయి. సమాంతర పట్టాలు కలవడం మరియు వేరవడం చూడటానికి మనోహరంగా ఉంది. నేను దీన్ని చూడటంలో ఎప్పుడూ అలసిపోను. దారి పొడవునా గోడలపై రాతలు చూడటం నాకు కొత్తగా అనిపించింది. మేము గ్రామాల గుండా వెళుతున్నప్పుడు పిల్లలు మా వైపు చేతులు ఊపారు. నేను కూడా వారికి చేతులు ఊపాను కానీ వారు మమ్మల్ని చూశారో లేదో నాకు తెలియదు.


మా రైలులో ఒక పరిశీలన మరియు వీక్షణ పెట్టె ఉంది. అక్కడ నుండి మేము అన్ని సుందరమైన అందాలను చూడవచ్చు. ఇది నాకు కొత్త అనుభవం. మరొక పెట్టెలో స్నాక్ బార్ ఉంది. అక్కడ మేము ఆహారం కొని తినవచ్చు మరియు వెచ్చని టీ లేదా కాఫీ తాగవచ్చు.


ప్రతి రైలు నిలయంలో వారు దాని పేరు మరియు నగరం గురించి కొంత సమాచారాన్ని ప్రకటించారు. ఒక్కో రైలు నిలయంలో ప్రయాణికులు దిగి రైలు ఎక్కారు. ప్రతి రైలు నిలయం విభిన్న రూపాన్ని కలిగి ఉంది, ఇది మరింత ఆసక్తికరంగా మారింది.


నేను అమెరికా కంటే భారతదేశంలో రైళ్లలో ప్రయాణించడానికి ఇష్టపడతాను. చాలా సార్లు, నేను రాత్రిపూట రైళ్లలో ప్రయాణించాను, అక్కడ మనం పూర్తిగా వొళ్ళు విరిచి పడుకోవచ్చు. రైలులో లయబద్ధంగా సాగే కదలిక, కూ కూ ఈల, పాత పంకా శబ్ధం, మొత్తంగా రైలు ప్రయాణ అనుభవం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. విక్రేతలు రైలు కదులుతున్నప్పుడు లోపలే ఆహారం మరియు పానీయాలను విక్రయిస్తారు మరియు ప్రతి స్టేషన్ నుండి కిటికీల ద్వారా కూడా విక్రయిస్తారు. 


రైలు వేగంగా వెళుతున్నప్పుడు తలుపు దగ్గర మీ ముఖాన్ని గట్టిగా తాకే గాలి ఉత్కంఠభరితమైన మరియు భయానక అనుభవం. ఇది ప్రమాదకరమని నాకు తెలుసు, కానీ నేను మా అమ్మ లేదా నాన్న దగ్గర ఉన్నప్పుడే ఇది చేసాను. పర్వతాలను అధిరోహించి, బీచ్‌ల పక్కన పరుగెత్తే రైళ్లు, సొరంగాల గుండా వెళ్లే రైళ్లు విభిన్న అనుభవాలను ఇస్తాయి.


అమెరికాలో సియాటెల్ నుండి లాస్ ఏంజిల్స్, చికాగో నుండి సియాటెల్, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజిల్స్ మరియు గ్రాండ్ కాన్యన్ వంటి మార్గాల్లో రైళ్లు అమెరికాలో ఉన్నాయి. ఈ మార్గాలు సుందరమైన అందాలతో నిండి ఉన్నాయి మరియు మరపురాని అనుభూతిని అందిస్తాయి. సుదూర రైళ్లు విభిన్న అనుభవాలను అందిస్తాయి.


నగరంలో మోనో రైళ్లు మరియు మెట్రో రైళ్లు వంటి అనేక రైళ్లు కూడా ఉన్నాయి, ఇవి ప్రయాణాన్ని సులభంగా మరియు వేగంగా చేస్తాయి. మోనోరైళ్లు ఒకే ట్రాక్‌పై నడుస్తాయి మరియు చాలా వరకు ఆటోమేటిక్‌గా ఉంటాయి, ఇవి నిరంతరాయంగా పైకి క్రిందికి ప్రయాణాలను చేస్తాయి. అవి ఎక్కువగా ఓవర్‌హెడ్ ట్రాక్‌లపై తిరుగుతాయి మరియు సిటీ ట్రాఫిక్‌ను నివారించడానికి నేను వాటి ద్వారా ప్రయాణించాను. ఇది రోజువారీ ప్రయాణికులు తమ కార్యాలయాలు మరియు పాఠశాలలకు సరైన సమయంలో ప్రయాణించడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ఇది వేగంగా ఉంటుంది మరియు భూగర్భంలోకి కూడా వెళుతుంది. నగరం లోపల ప్రయాణించడానికి ఇది ఉత్తమ మార్గం. నేను ఈ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కువగా బయటి విషయాలు గమనించలేదు, ఎందుకంటే నేను సాధారణంగా నా గమ్యస్థానం కోసం వేచి చూస్తాను.


ట్రామ్‌లు నెమ్మదిగా ఉంటాయి మరియు కార్లు మరియు ట్రక్కులతో పాటు వాటి స్వంత ట్రాక్‌లపై కదులుతాయి. వాటికి గంట మరియు వాటి మార్గంలో కొన్ని ఆగే స్థలాలు ఉన్నాయి. ఇది ఒక తమాషా అనుభవం, మరియు నేను ట్రామ్‌లలో కూడా నా ప్రయాణాన్ని ఆస్వాదించాను.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

రైనర్ శిఖరం వద్ద సూర్యోదయం - Sunrise at Mt. Rainier

మేరీమూర్ పార్క్

ప్రాథమికోన్నత పాఠశాలలు - ప్రపంచ భాషా క్రెడిట్‌లు- Higher secondary schools - World language credits